BJPలో రాథోడ్ రమేష్ కలకలం.. MP రెబల్ అభ్యర్థిగా నామినేషన్

by Disha Web Desk 4 |
BJPలో రాథోడ్ రమేష్ కలకలం.. MP రెబల్ అభ్యర్థిగా నామినేషన్
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కమలం పార్టీ‌లో కాక పుట్టిస్తున్నారు. బీజేపీ టికెట్ కోసం చివరి దాకా ప్రయత్నం చేసిన రాథోడ్ రమేష్ టికెట్ దక్కక పోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ నుండి వలస వచ్చిన నగేష్‌కు టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. అయితే తాజాగా ఆయన బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. బీ ఫామ్ లేకుండానే ఆయన నామినేషన్ వేశారు.

చివరి దశలో తనకు పార్టీ అధిష్టానం సీ - ఫామ్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారని తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఒకవేళ సీ - ఫామ్ ఇవ్వకపోతే రాథోడ్ రమేష్ పోటీ నుండి తప్పుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బీ ఫామ్ లేకుండా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్లాన్‌లో ఉన్నారా..? అనే అనుమానం కూడా కలుగుతోంది. రాథోడ్ రమేష్ వ్యవహారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నది. అయితే ఆయన అనుచరులు సహా లంబాడా సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం మొదలైంది.



Next Story

Most Viewed