- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌ను MS ధోనీతో పోల్చిన అంబటి రాయుడు.. దద్దరిల్లిన బహిరంగ సభ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అద్భుతంగా రాణించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని నెలల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం కొన్నాళ్లకే వైసీపీ గుడ్ బై చెప్పి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే జనసేన-టీడీపీ-బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాయులు ప్రచారం నిర్వహించారు. రెండ్రోజులుగా వరుసగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ప్రచారంలో భాగంగా రాయులు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోని, పవన్ కల్యాణ్‌లకు ఉన్న క్రేజ్ గురించి మాట్లాడారు. ఇద్దరే ఇద్దరు వ్యక్తులకు ఇంత మొత్తంలో ఫ్యాన్స్ ఉండటాన్ని చూశానని.. క్రికెట్‌లో ఎమ్ఎస్ ధోని, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాన్ అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా బహిరంగ సభ మొత్తం దద్దరిల్లిపోయింది. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఫ్యా్న్స్ అరుపులు కేకలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More..
ఆ శక్తి జగన్‌కు లేదు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు