యాంకర్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫన్నీ కామెంట్.. వైరలవుతోన్న వీడియో!

by Disha Web Desk 9 |
యాంకర్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫన్నీ కామెంట్.. వైరలవుతోన్న వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: పదవి కంటే వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తినని హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. తెలంగాణలో గవర్నమెంట్ కూలిపోబోతోందని ఒక టాక్ వస్తది? హరీష్ రావు ఏక్‌నాథ్ షిండ్ అవుతారని అంటారు? దానికి మీ సమాధానమేంటని అడగ్గా.. ముందుగా హరీష్ రావు యాంకర్‌పై.. మీకు తెలుగు బాగా ఇంప్రూవ్ అయ్యింది ఉమా అంటూ ఫన్నీ కామెంట్ చేస్తూ.. నేను పదవి కంటే వ్యక్తిత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. పదవి కోసం నా క్యారెక్టర్‌ను పోగొట్టుకోలేనని వెల్లడించారు. ఎందుకంటే పదవి రావొచ్చు.. పోవచ్చునని అన్నారు. కానీ పోయిన వ్యక్తిత్వాన్ని మనిషి జీవితంలో పొందలేడని అన్నారు. కాగా క్యారెక్టర్‌కు వ్యక్తిత్వానికే ప్రాధాన్యతనిస్తానని వెల్లడించారు. ఏదైనా పార్టీ నిర్ణయానికి కేసీఆర్‌కు లోబడే హరీష్ రావు ఉంటడు తప్ప ఏక్ నాథ్ షిండే కాలేడు. అంటూ హరీష్ రావు చెప్పుకొచ్చారు.

Read More..

వాళ్లు మళ్లీ కేసీఆర్‌ను గుర్తుచేసుకునే పరిస్థితి వచ్చింది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed