ప్రెగ్నెన్సీలో ఇలా చేస్తే తల్లికే కాదు, పుట్టబోయే బిడ్డకూ మంచిదంటున్న నిపుణులు

by Dishafeatures2 |
ప్రెగ్నెన్సీలో ఇలా చేస్తే తల్లికే కాదు, పుట్టబోయే బిడ్డకూ మంచిదంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : గర్భధారణ ప్రతీ స్త్రీ జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయంగా భావిస్తారు. అదే సందర్భంలో ఆరోగ్య పరమైన సమస్యలు, సవాళ్లు, రోజువారీ ఇబ్బందులు కూడా ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకొని బిడ్డకు జన్మనివ్వాలంటే హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా మసలు కోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. అయితే కేర్ తీసుకోవడమనేది కేవలం ప్రెగ్నెంట్ అయినా మహిళకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఆమె భర్త, కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ఏం చేయాలో సూచిస్తున్నారు.

* గర్భంతో ఉన్నప్పుడు శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మెంటల్లీ హ్యాపీగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో హెల్తీగా, హ్యాపీగా ఉండటంవల్ల నార్మల్ డెలివరీ అయ్యే చాన్సెస్ పెరుగుతాయని చెప్తుంటారు. కాబట్టి తగిన పోషకాహారం తీసుకోవడం, సంతోషంగా గడపడం ముఖ్యమనే విషయాన్ని గర్భవతితోపాటు ఆమె కుటుంబ సభ్యులు గుర్తించాలి. అందుకోసం సహకరించాలి.

* గర్భిణులకు నిద్ర, విశ్రాంతి చాలా అవసరం. ఇది తల్లికి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువసేపు నిద్రపోయేలా చూసుకోవాలి. అలాగే భార్యా భర్తలు, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు, సరదాలు గర్భవతిగా ఉన్న మహిళ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. పరోక్షంగా ఆమె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ విధమైన వాతావరణం ఉండేలా జాగ్రత్త పడాలి.

* గర్భవతిగా ఉన్నప్పుడు పాదాలపై అధిక భారం పడుతుంది. రక్త ప్రరణలో ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పాదాలకు మసాజ్ చేయడం, వాకింగ్ చేయడం కూడా ముఖ్యం. దీంతో రక్త ప్రసరణతోపాటు రిలాక్సేషన్ అందుతుంది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రెగ్నెంట్ అయిన మహిళ అడగకపోయినా అర్థం చేసుకొని ఆమె ఆరోగ్య విషయంలో సహకరించాలి. నెలలు నిండే కొద్దీ వచ్చే సమస్యల పట్ల సదరు మహిళతోపాటు భర్త, కుటుంబ సభ్యులు అవగాహన కలిగి ఉండటం, ప్రతి సందర్భంలో భరోసా ఇవ్వడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. తద్వారా శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Next Story

Most Viewed