SLBC Incident : ర్యాట్ హోల్ మైనర్స్ వెనక్కి.. కారణం ఇదే!

by M.Rajitha |
SLBC Incident : ర్యాట్ హోల్ మైనర్స్ వెనక్కి.. కారణం ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్(SLBC Tunnel Rescue Operation) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న ర్యాట్ హోల్ మైనర్స్(Rat Hole Miners) టన్నెల్ నుంచి వెనక్కి వచ్చేశారు. ఉత్తరాఖండ్(Uttharakhand) నుంచి ప్రత్యేకంగా పిలిపించిన ర్యాట్ హోల్ మైనర్స్ శుక్రవారం ప్రమాద స్థలానికి చేరుకున్నారు. నేవీ(Navy), ఆర్మీ(Army), ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలతో కలిసి వీరు టన్నెల్ కూలిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అయితే అక్కడి పరిస్థితి చూసి వారు చేతులెత్తేశారు. మంగళవారం సాయంత్రం 11 మంది రెస్క్యూ టీం లోపలికి వెళ్లినప్పుడు13.50 కిమీల దగ్గర 22, 23 బ్లాక్స్ చాలా లూస్‌గా ఉండి, సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ ఫిక్స్ చేసిన గోడల నుంచి నీరు ఊరుతున్న విషయాన్ని గమనించామని తెలిపారు.

ఏ క్షణంలోనైనా సిమెంట్ సెగ్మెంట్స్, పైనుంచి మట్టి కూలే ప్రమాదం ఉందని, ఊపిరి తీసుకోవడానికి కూడా ఆ ప్రదేశంలో ఇబ్బందిగా ఉందని టన్నెల్ నుంచి బయటికి వచ్చేశారు. టన్నెల్ లో టీబిఎం శిథిలాలు కనిపించే చివరి ఏరియా వరకు వెళితే.. నీళ్ళు దుంకుతున్న శబ్దం తప్ప వేరే ఏం వినిపించడం లేదన్నారు. కార్మికులు సజీవంగా ఉన్నారన్న ఆశలు లేవని.. బురద, నీటి ప్రవాహం,శిధిలాల మధ్య లోపల పరిస్థితి చాలా భయానకంగా ఉందన్నారు. శిథిలాలు తొలగించడానికి చాలా రోజులు పడుతుందని తెలిపారు. డెహ్రాడూన్ - ఉత్తర కాశీ ప్రమాదంలో 41 మందిని కాపాడిన పరిస్థితులు వేరు.. ఇక్కడి ప్రమాద తీవ్రత వేరన్నారు. ఈ ప్రమాదం చాలా పెద్దదని, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న వారికి రిస్క్ ఎక్కువ అని ర్యాట్ హోల్ మైనర్స్ తెలిపారు.

Next Story

Most Viewed