- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR ఫ్యామిలీ మొత్తానికి 4 ఉద్యోగాలైతే.. రేవంత్ ఒక్కడికే 4 శాఖలు: రాణి రుద్రమ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేసిందని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి విమర్శించారు. నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్‌ను గాంధీ ఆసుపత్రిలో శనివారం ఆమె పరామర్శించారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల కోసం గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని భరోసా ఇచ్చి, దీక్ష విరమించాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబం నాలుగు ఉద్యోగాలు తీసుకుంటే రేవంత్ రెడ్డి ఒక్కడే నాలుగు శాఖల మంత్రిగా నాలుగు ఉద్యోగాలు తీసుకుని నిరుద్యోగులను మాత్రం నిండా ముంచుతున్నరని ధ్వజమెత్తారు.
అమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్‌కు ఏదైనా హాని జరిగితే దానికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్కరు అలిగితే అయిదుగురు మంత్రులు వెళ్లారు. ఒక నిరుద్యోగి అమరణ దీక్ష చేస్తుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎందుకు రాలేదని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. సెలబస్ వేరుగా ఉన్నందున పరీక్షకు పరీక్షకు మద్యన కనీసం 40 రోజుల సమయం ఉండేట్టు చూడాలని, జీవో 46ను రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.