- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధురాలి ఇంటి నిర్మాణానికి అండగా నిలిచిన జడ్పీటీసీ..
దిశ, తలకొండపల్లి: మండలంలోని దేవుని పడకల్ కు చెందిన దాస బాలమణి(80) అనే వృద్ధురాలు ఉన్న ఇల్లు కూలిపోయి నిరాశ్రయురాలయింది. ఆమెను చూసుకోవడానికి ఎవరు లేకపోవడంతో స్థానిక సర్పంచ్ కాడమోని శ్రీశైలం చలించిపోయి ఇల్లు బీస్మెంట్ నిర్మాణానికి నెల రోజుల క్రితం 30 బస్తాల సిమెంట్ ఇప్పించి మేమున్నామని ధైర్యం కల్పించాడు. కానీ బీస్మెంట్ లెవల్ కు చేరుకున్న తర్వాత గ్రామస్తులు ఎవరు సహకరించకపోవడంతో ఆ వృద్ధురాలు ఏమీ చేయలేక ఉండిపోయింది. చివరకు తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ తో పాటు, స్థానిక నేతల ద్వారా విషయం తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ దృష్టికి చేరింది.
వెంటనే చలించి పోయిన జడ్పీటీసీ ఎంతోమందికి సాయం చేస్తున్నాం, ఆ వృద్ధురాలికి ఇల్లు కట్టిస్తే, ఉన్నన్ని రోజులైనా మనశ్శాంతితో జీవిస్తుందని వెంటనే నిర్ణయం తీసుకొని, వెనువెంటనే తన ట్రస్ట్ సభ్యులతో దాస బాలమణి ఇంటి నిర్మాణానికి ఇటుక, సిమెంటు, ఇసుక, కంకర, స్టీల్ ఇప్పించి పూర్తిస్థాయిలో మెటీరియల్ అందించి ఇల్లు పూర్తి అయ్యే విధంగా చూడాలని తన ట్రస్టు సభ్యులకు సూచించారు. ఆ నిరుపేద వృద్ధురాలి ఇంటి నిర్మాణానికి జడ్పీటీసీ సహాయ సహకారాలు అందించడంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, గ్రామస్తులు వృద్ధురాలు తరపున ఉప్పల వెంకటేశ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.