- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా.. నాకోసం వెతకొద్దు
దిశ, బడంగ్పేట్ : నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని, నా కోసం వెతుకొద్దని కుమారుడికి చెప్పి తల్లి అదృశ్యమయిన ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం జల్పల్లి గ్రామం అదానన్ కాలనీకి చెందిన నసీన్బేగం(45), లేట్ మొహమ్మద్ మఖ్భూల్ లు దంపతులు. భర్త చనిపోవడంతో నసీన్బేగం, కుమారుడు మొహమ్మద్ మన్నన్తో కలిసి ఉంటుంది. ఈ నెల 14వ తేదీన ఉదయం 8.30 గంటలకు ఎప్పటిలాగే మొహమ్మద్ మఖ్భూల్ లింగంపల్లిలో డ్యూటికి వెళ్ళాడు.
దీంతో ఒంటరిగా ఉన్న తల్లి నసీన్ బేగంకు మొహహ్మద్ మఖ్బూల్ ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన తల్లి నేను ఇంటి నుంచి వెళ్లి పోతున్నానని, నా కోసం వెతకొద్దని చెప్పింది. వెంటనే లింగంపల్లి నుంచి కుమారుడు జల్పల్లికి చేరుకున్నాడు. తల్లి ఫోన్ కూడా స్విచ్ఆఫ్ చేసి ఉంది. దీంతో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువుల ఇంట్లో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో మన్నన్ పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.