- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరిలో నిలిచేదెవరు..?
దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పై విస్తృతంగా చర్చ సాగుతుంది. అధికార పార్టీ అభ్యర్ధి ఎవరనే ప్రచారం జోరుగా సాగుతుంది. నిన్న, మొన్నటి వరకు ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు క్యామ మల్లేశం, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలు ఈ ధపా ఎన్నికల్లో పోటికి సిద్దమైతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ జనవరి 22న ప్రగతి నివేదన యాత్రను ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి (బంటి) నందివనవర్తి గ్రామంలో ప్రారంభించారు. ఈ ప్రారంభానికి పోటిలో ఉంటారని భావించిన క్యామ మల్లేష్ సైతం హాజరు కావడంతో చర్చ మరోవైపునకు మళ్లింది. ఎప్పుడైన ఎవరైన యాత్రలు చేస్తే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు, మరో పదవిని ఆశించేందుకేననే ప్రచారం తప్పకుండా సాగుతుంది. అందులో భాగంగానే ప్రశాంత్ రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్రతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విస్తృత చర్చ సాగుతుంది.
ఈ ఎన్నికల్లో తండ్రి తప్పుకొని తనయుడిని బరిలో నిలపనున్నారనే ప్రచారం కోడై కూస్తుంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఈ ధపా ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడిని పోటీలో నిలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రగతి నివేదన యాత్ర ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆశ్సీసులు తీసుకున్నారు. ఈ యాత్రతో గ్రామాల్లోని సమస్యలకు తమది భరోసా అంటూ తండ్రి మద్దతుతో ముందుకు పోతున్నాడు. యాత్ర ప్రారంభ సభలో స్ధానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని, కిషన్ రెడ్డి మద్దతు కావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కమిటీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
ఈ నివేధన యాత్రలో భాగస్వామ్యం కానీ తుర్క యంజాల్ మున్సిపాలిటీని తండ్రి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మార్నింగ్ వాక్‌తో ముందుకుపోతున్నారు. ఈ ధపా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డినే బరిలో ఉంటారనే ప్రచారం ప్రగతినివేధన యాత్రతో బలపడింది. దీంతో తండ్రి, తనయుడు కలిసిపోతారా... లేక ఎవరికివారే బరిలోకి సిద్దమైతారా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఈ ప్రగతి నివేధన యాత్రలో ప్రశాంత్ రెడ్డి ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే మైనస్ కాకతప్పదనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే పాదయాత్రలో పెద్దగా ప్రజల మద్దతు లేదనే ఆరోపణలున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య జరిగే ప్రగతి నివేదన యాత్ర మంచిరెడ్డి కుటుంబానికి కలిసి వస్తుందా.. లేదా వేచిచూడాల్సిందే.