- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలె యాదయ్యను ఓడిస్తాం
దిశ చేవెళ్ల :ఇటీవల బీఆర్ఎస్ పార్టీ 115 మందిని తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేరు ఖరారు చేసిన నేపథ్యంలో సొంత పార్టీలో ఓ వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య పేరు ఖరారైది.ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయులు కాలె యాదయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం మొయినాబాద్ మండల్ కు చెందిన నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఎమ్మెల్యే కాలె యాదయ్య పై అసహనం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే యాదయ్య వెంచర్స్, ఫామ్ హౌస్ లో డబ్బు వసూలు చేసి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. 40 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎస్సీ రిజర్వేషన్ ఒక కుటుంబానికి పరిమితమైతే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టులు సైతం అమ్ముకుంటున్నారని అవకాశవాదులకు సీట్లు ఇచ్చి నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దళిత, బిసి బంధులో అవినీతి జరిగిందని స్వయంగా చేవెళ్ళ ఎంపిపి ఆరోపించారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీ ఫాములను లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ బలపరిచిన ఓడిపోయే వ్యక్తి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాలె యాదయ్యను ఓడించడానికి తాము సిద్ధమన్నారు. తమ గ్రామాలలో శుభోదయం కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వరని మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, సీనియర్ నాయకులు మండిపడ్డారు.