CM Revanth Reddy : శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నాం

by Aamani |
CM Revanth Reddy : శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నాం
X

దిశ, గండిపేట్: అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేట్ హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులనుకాపాడుతున్నామని,అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అన్నారు. చెరువులు ఆక్రమించిన వాళ్ళను ఎవర్నీ వదలమని, ఎంత ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదని స్పష్టం చేశారు.

కొందరు బఫర్ జోన్లలో భవనాలు నిర్మించారని, ఆ భవనాల వ్యర్థాలను గండిపేట్ లో వదులుతున్నారని అన్నారు. చెరువుల సంరక్షణ ఎంతో కీలకమని, చెరువులు మన సంస్కృతి, జీవనాదారమని అన్నారు.“చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి విముక్తి చేయాలనుకున్నాం. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నాం. చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తాం. కొందరు శ్రీమంతుల విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించారు. వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారు. చెరువులు మన జీవనాధారం, సంస్కృతి. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

వరదల నివారణకు నాటి నిజాం గొప్ప ప్రణాళికలు వేశారని, హైదరాబాద్ ను లేక్ సిటీగా 100 ఏళ్ల క్రితమే నిర్మించారని అన్నారు. హైదరాబాద్ దాహాన్ని తీర్చేది నిజాం, ఉస్మాన్ సాగర్ లే అని అన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనని అన్నారు. శ్రీకృష్ణుడి బోధనను అనుసరించే తాను పాలన చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, హరే కృష్ణ మూమెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story