రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి

by Sumithra |
రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఖరీఫ్ కాలం పత్తి కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా మిల్లర్లు పత్తి సేకరణ నిర్వహించాలని సూచించారు.

మిల్లుల వద్ద రైతులకు అవసరమైన మరుగుదొడ్లు, త్రాగు నీటి సదుపాయాలు కల్పించాలని అన్నారు. తేమ శాంతం 8కి తగ్గకుండ ఉన్న పత్తికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.6,380/- ప్రకటించిందన్నారు. అనంతరం పత్తి మద్దత్తు ధర తెలిపే పోస్టర్లను జిల్లా కలెక్టర్ నిఖిలతో ఆవిష్కరింపజేశారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాని, మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ లావణ్య, జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకటరమణ రెడ్డి, తూనికలు కొలతలు, విద్యుత్ శాఖ అధికారులు, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story