రాజన్న ఆలయం జోలికి వస్తే సహించేది లేదు: వి హనుమంతరావు

by Mahesh |   ( Updated:2023-09-11 07:01:30.0  )
రాజన్న ఆలయం జోలికి వస్తే సహించేది లేదు: వి హనుమంతరావు
X

దిశ, గండిపేట్: ఖానాపూర్‌లోని రాజన్న గుట్ట ఆక్రమిస్తే సహించేది లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేట్, ఖానాపూర్‌లోని సిని పోలీస్ వద్ద సర్వేనెంబర్ 274 రాజన్న గుట్టను మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న గుట్టను ఎవరు ఆక్రమించిన ఊరుకునేది లేదని గుడికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక్కడ వందల సంవత్సరాల క్రితం నుంచి ప్రార్థన ఆలయం ఉన్నదని అందరికీ తెలుసు ఈ ఆలయానికి సంబంధించిన కుర్ర శ్రీనివాస్ రావు రెండెకరాలు కేటాయించిన విషయం అందరికి తెలిసిందే. సిని పోలీస్ వద్ద ఉన్న ఈ పదో నెంబర్ ప్లాట్‌ను 100కోట్లతో ఆక్షన్ లో ఏపీఆర్ కన్స్ట్రక్షన్ వారు తీసుకున్నారు. ఈ గుట్టలోని భూమిని ఏపీ ఆర్ సంస్థ రోడ్డును వేస్తూ గుడికి సంబంధించిన స్థలంలో పనులు చేస్తున్నారు దీంతో ఆ స్థలంలో గుడికి కేటాయించాలని గుడి స్థలంలో పనులు ఎవరు చేయరాదని ఆయన అన్నారు.

గుడికి ఖచ్చితంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖానాపూర్, కోకాపేట్ సర్వే నెంబర్ 239, 240 పేదలకు పేద ప్రజలకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. 60 గజాల స్థలాన్ని వారికి కేటాయించాలని ఆయన అన్నారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేటాయించిన 60 గజాల స్థలాలను వారికి కేటాయించకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. గుడి స్థలంపై, పేదలకు కేటాయించిన 60 గజాల స్థలం 19వ తారీఖున అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తానని అయినా ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆ స్థలాలపై పేదలు కాకుండా వేరే ఎవరు నిర్మాణాలు చేసిన మేమే స్వయంగా కూల్చివేతలు చేస్తామని ఆయన హెచ్చరించారు. 11 గంటలు అయినా ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులు రాకపోవడంపై వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ హెచ్ఎండిఏ ఛైర్మన్ కోదండరెడ్డి, ఖానాపూర్ మాజీ సర్పంచ్, పసుల ఉపేందర్, మన్నే నరేందర్, కిషన్, మహేందర్, స్వామి దాసు, మాణిక్యం, నగేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story