- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఔటర్ హద్దు వరకు అర్బన్ ప్రాంతాలే
దిశ, రంగారెడ్డి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్డులోని గ్రామాలు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని భావించింది. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపాలిటీల్లోనే మరిన్ని గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఔటర్ రింగ్ రోడ్డు హద్దుగా అర్బన్ ప్రాంతంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమైతుంది. ఇప్పటి వరకు ఔటర్‌కు అటు ఇటుగా ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలను సైతం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అర్బన్ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీకి ఫుల్‌స్టాఫ్...
ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాలన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీ ప్రక్రియపై మంత్రివర్గ ఉపసంఘం వేసింది. దీంతో ఆ ప్రక్రియ ఆలస్యంకానున్నట్లు తెలియడంతో ముందుగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసి, ఆ తర్వాత జీహెచ్ఎంసీలో విలీనంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకే సారి పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం చట్టవ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కనుక మొదటగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసిన తర్వాతే జీహెచ్ఎంసీ ఆలోచన ఉండే అవకాశం కనిపిస్తోంది. సుమారుగా ఐదేండ్లు విలీనం చేసిన మున్సిపాలిటీగా కొనసాగిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
విలీన గ్రామాలు ఇవే...
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, పెద్ద అంబర్పేట్, నార్సింగ్, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో 12 గ్రామాలను విలీనం చేశారు. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట గ్రామ పంచాయతీలను పెద్ద అంబర్‌పేట్‌లో... బహుదూర్‌గూడ, పెద్దగోల్కోండ, చిన్న గోల్కోండ, హమ్మిదుల్లానగర్, రషీద్‌గూడ, గ్యాంసీమయగూడ గ్రామ పంచాయతీలు శంషాబాద్‌లో... మిర్జాగూడ గ్రామ పంచాయతీ నార్సింగ్‌లో... హర్షగూడ గ్రామ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలల్లో విలీనమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది.
ఐదేండ్లు కొనసాగాల్సిందే...
మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేయడంతో జీహెచ్ఎంసీలో విలీనం అసాధ్యం. శంషాబాద్, పెద్ద అంబర్పేట్, నార్సింగ్, తుక్కుగూడ మున్సిపాలిటీలు యధావిధిగానే మరో ఐదేండ్లు కొనసాగే అవకాశం ఉంది. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం పంచాయతీలు మున్సిపాలిటీగా మారినప్పుడు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే మున్సిపాలిటీగా పరిపాలన కొనసాగిన తర్వాతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ పంచాయతీలు మున్సిపాలిటీలో చేరిన వ్యవధిలో జీహెచ్ఎంసీగా ఏర్పాటుకు కొత్త చిక్కలు వచ్చే అవకాశం ఉంది.
- Tags
- Urban areas