ఆపరేషన్ వికటించడంతో యువకుడు మృతి

by sudharani |
ఆపరేషన్ వికటించడంతో యువకుడు మృతి
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం రాత్రి ఆపరేషన్ వికటించి యువకుడు మృతి చెందాడు. తలకొండపల్లి మండల పరిధి రాంపూర్ గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి (25) అపెండెక్స్ నొప్పితో స్వాతి హాస్పిటల్‌లో చేరాడు. బుధవారం రాత్రి ఆ యువకుడికి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఎమర్జెన్సీ పరిస్థితి ఉండడంతో హైదరాబాద్‌లోని ఓజోన్ హాస్పిటల్‌కు తరలించగా.. ఆపరేషన్ వికటించి యువకుడు చనిపోవడం జరిగింది.

యువకుడు మృతికి కారణమైన ఆమనగల్లు స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను వెంటనే మూసివేసి తగు చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, రాంపూర్ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమనగల్లులోని హాస్పిటల్ ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు. సీఐ ఉపేందర్, ఎస్ఐ సుందరయ్య, పోలీస్ సిబ్బంది పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed