- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యుల పైన జలమండలి అధికారుల ప్రతాపం
దిశ, గండిపేట్ : బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో సామాన్యుల పైన జలమండలి అధికారుల ప్రతాపం చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్శాకోట్ గ్రామంలో నివసించే పాశం పెంటయ్యకు జలమండలి అధికారులు 18 నెలలకుగాను మంచినీటి బిల్లును 65 వేల రూపాయలను విధించారు. ఈ నీటి బిల్లును చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా అవాక్కయ్యారు. జలమండలి అధికారుల నిర్వాకానికి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా వారంలో రెండు, మూడు రోజులకు ఒక్కసారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలా నీటి బిల్లులను వేలకు వేలు విధిస్తే తాము ఎలా తట్టుకుంటామని వాపోతున్నారు. ఒకపక్క కరెంట్ బిల్లు మోతలతో బ్రతుకు బండిని బతకలేక చావలేక కొనసాగిస్తుంటే, ఇప్పుడు కొత్తగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నీటి బిల్లులతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని స్థానిక ప్రజలు జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని నీటి బిల్లులను అందరూ కట్టే విధంగా వచ్చేలా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.