పురుగుల అన్నం పెడ్తున్నరు.. రోడ్డుపై విద్యార్థినుల ఆందోళన

by Nagam Mallesh |
పురుగుల అన్నం పెడ్తున్నరు.. రోడ్డుపై విద్యార్థినుల ఆందోళన
X

దిశ, శంషాబాద్ : హాస్టల్ లో పురుగుల అన్నం పెడుతున్నారని.. అడిగితే టీచర్లు వేధిస్తున్నారంటూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. టీచర్ల వేధింపులు భరించలేకపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ మండలం పాలమాకులలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొన్ని రోజులుగా హాస్టల్లో విద్యార్థులకు పెట్టిన అన్నం సాంబార్ టిఫిన్లలో పురుగులు వస్తున్నాయని సదరు విద్యార్థినులు చెబుతున్నారు. టీచర్లకు మినరల్ వాటర్ విద్యార్థులకు బోరువాటరిస్తున్నారని గత ఎన్నోసార్లు ఉన్నత అధికారులకు టీచర్లకు మొరపెట్టుకున్నా, టీచర్ల వేధింపులు పెరగడంతో న్యాయం జరగట్లేదని.. శుక్రవారం పాలమాకుల వద్ద గల హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై విద్యార్థినులు బైఠాయించి ఆందోళనకు దిగారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ మాధవి, టీచర్ల మధ్య విభేదాలు రావడంతో.. వార ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకుని.. ఏమీ ఎరుగని విద్యార్థులపై వేధింపులు చేస్తున్నారు. విద్యార్థుల ధర్నాలను శాంతింప చేయడానికి రంగారెడ్డి జిల్లా డిఈఓ సుసింధర్రావు, శంషాబాద్ ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, శంషాబాద్ పోలీస్ స్టేషన్ సిఐ నరేందర్ రెడ్డి చేరుకొని.. సమస్యలు వారం రోజులలో మీ సమస్యలు తీరుస్తామని డీఈవో సుసింధర్ రావు, సిఐ నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. రంగారెడ్డి జిల్లా డిఈఓ సుసిందర్ రావు మాట్లాడుతూ పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. టీచర్ల మధ్య అవగాహన లేకపోవడం వల్లే పాఠశాలలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story