- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vikarabad: బీఆర్ఎస్‌లో భగ్గుమన్న అసమ్మతి.. మెతుకు ఆనంద్‌ను మార్చాలని డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ లిస్టు వికారాబాద్ నేతల్లో చిచ్చు రేపింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఇలా ప్రకటించారో లేదో పలుచోట్ల అసమ్మతి సెగ రాజుకుంది. ఈ సారైనా టికెట్ దక్కకపోదా అని ఆశలు పెట్టుకున్న నేతల్లో అసంతృప్తి కట్టలు తెచ్చుకుంది. అలాగే పలుచోట్ల సిట్టింగులపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు ఏకంగా వారిని మార్చాలనే డిమాండ్ సైతం ఊపకుంది. వికారాబాద్‌లోనూ ఇలాంటి కామెంట్సే వినిపిస్తోంది. వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో వికారాబాద్‌లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మెతుకు ఆనంద్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ మాజీ మార్కెట్ కమటీ చైర్మన్ రామచంద్రారెడ్డి పట్టుబడుతున్నారు. వికారాబాద్ టికెట్ మార్చకపోతే పుట్టదులుండవని శాపనార్ధాలు పెడుతున్నారు.
వికారాబాద్ బసంత్ ఫంక్షన్ హాలులో అసమ్మతి నాయకులంతా సమావేశయ్యారు. వికారాబాద్ టికెట్‌ను తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని తీర్మానం చేశారు. మెతుకు ఆనంద్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. మెతుకు ఆనంద్ ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరించారు.