- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పసి బాలుడు మాయం!
దిశ, తాండూరు రూరల్ : అమ్మ కొంగుకు కట్టుకున్న ఏడాది బాలున్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో సోమవారం కలకలం రేపింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రాత్రి నిద్రించే సమయంలో పసిబాలుడు బయటికి వెళతాడనే భయంతో బాలుడి తల్లి తన చీర కొంగుకు కట్టుకుని నిద్రించిందని చెప్పారు. పక్కలో ఉన్న ఏడాది బాలున్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు పోయారంటూ సోమవారం కరన్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై విఠల్ రెడ్డి వెల్లడించారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పసి బాలుడు మిస్సయిన ఘటనపై అక్కడి స్థానికుల తో పాటు బతుకుదెరువు కోసం వచ్చిన ఆ కుటుంబ సభ్యులను ఆరా తీశారు.
కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన భాష అనే వ్యక్తి భార్య గోరీబీ, తన ముగ్గురు పిల్లలతో కలిసి గౌతాపూర్ గ్రామానికి బతుకు తెరువు కోసం వచ్చారని గత కొన్ని రోజులుగా గ్రామంలో గ్యాస్ స్టవ్ రిపేర్లు, చిన్న చిన్న మరమ్మత్తుల పనులు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి గ్రామంలోని మల్లిఖార్జున స్వామి ఆలయ ప్రాంగణం వద్ద కుటుంబంతో కలిసి నిద్రించిన్నట్లు గుర్తించామన్నారు. తన కుమారుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారంటూ పోలీసుల ముందు మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్ఐ మిస్సింగ్ అయిన బాలుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.