సివిల్ సప్లయ్ గోదాం ఎదుట హమాలీ కార్మికుల నిరసన

by Aamani |
సివిల్ సప్లయ్ గోదాం ఎదుట హమాలీ కార్మికుల నిరసన
X

దిశ,రామన్నపేట : హమాలీలకు పెంచిన కూలి రేట్ల జీవోను విడుదల చేయాలని సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూరి నర్సింహ్మా,ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే నటసింహ్మ డిమాండ్ చేశారు. సివిల్ సప్లయ్ ఎగుమతి, దిగుమతి పనులు నిలిపివేసి గురువారం మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ గోదాం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ సమ్మె ప్రారంభించారు. సమ్మెకు సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ కార్మికులకు మద్దతు తెలిపి, మాట్లాడారు. స్వీపర్లకు, కార్మికులకు రెండు సంవత్సరాలకు కూలీ రేట్లు పెంచుతూ గత ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, పెంచిన జిఓ ప్రకారం జనవరి 2024 సంవత్సరం నుండి నూతన రేట్లు అమలు చేయాలన్నారు.

దీనిపై అక్టోబర్ మాసంలో సివిల్ సప్లయ్ కమిషనర్ సమక్షంలో చర్యలు జరిపి, రేట్లు పెంచుటకు ఒప్పందం జరిగిందన్నారు. మూడు నెలలు పూర్తి కావస్తున్న నేటికీ ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో సమ్మె చేపడుతున్నామన్నారు. తక్షణమే ప్రభుత్వం సందర్శించి జీవోను విడుదల చేసి కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల నాయకుడు శివరాత్రి సమ్మయ్య, బండ స్వామి, తోటకూర అంజయ్య, మోటి నగేష్, ఏనుగ అచ్చాలు, గొరిగే రవి, పెంటయ్య, మోటే వెంకటేష్, ఉప్పలయ్య, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed