సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపు మళ్ళింది : రోహిత్ రెడ్డి

by Aamani |   ( Updated:2023-11-01 10:26:20.0  )
సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపు మళ్ళింది : రోహిత్ రెడ్డి
X

దిశ,తాండూరు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపు మళ్లిందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం అనంతరం, గుంతబాష్పల్లి, పట్టణలకు చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ చేరుతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు బీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed