- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం..!
దిశ, కోట్ పల్లి : బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా కోట్ పల్లి బీఆర్ఏస్ అధ్యక్షులు సుందరి అనిల్ అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధమున్నట్లు అనుమానిస్తూ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను మండల బీఆర్ఏస్ శ్రేణులు ఖండిస్తున్నారు. లగచర్లలో జరిగిన వివాదానికి బీఆర్ఎస్ పార్టీకి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతుందని అన్నారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.
లగచర్లలోని ఫార్మా సిటి పేరిట రైతుల భూములు బలవంతంగా లాక్కునేందుకు యత్నించడంతోనే రైతులు దాడులకు పాల్పడ్డారని అన్నారు. అధికారుల పై దాడులు చేయడం తప్పుగా బావిస్తున్నామని, దానిని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అటు మూసీ నది, ఇటు ఫార్మ సిటీ పేరుతో రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా జహీరాబాద్‌లో ఫార్మా సిటీ, ఇతర పరిశ్రమల కోసం 19వేల ఎకరాలు అక్కడ ప్రజలు భూములు ఇచ్చేందుకు ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినా కూడ సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కోడంగల్ లో తన అల్లుడి కోసం పనిచేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పార్టీ పిలుపు మేరకు ప్రజలు ఉద్యమాలను చేపడుతామన్నారు. ఏ అరెస్టులు ఉద్యమాలను అపలేవన్నారు.. ఉరేస్తారా అంటూ మండిపడ్డారు. మీరు ప్రజల వైపు ఉన్నారా..? లేదా.. సీఎం రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా అని తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.