Thandur: ప్రభుత్వ భూమి కబ్జా చేసి స్టోన్ క్రషర్ నిర్మాణం!

by Ramesh Goud |
Thandur: ప్రభుత్వ భూమి కబ్జా చేసి స్టోన్ క్రషర్ నిర్మాణం!
X

దిశ, తాండూరు రూరల్ : ప్రభుత్వ భూముల ఆక్రమణల దందా కొనసాగుతున్నది. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్క డ అక్రమార్కులు వాలిపోతున్నారు. ఫిర్యాదులు వస్తేనే గానీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రూ.కోట్ల విలువైన స్థలాలు పరాధీనమైపోతున్నాయి. ఈ క్రమంలో తాండూరు మండలం అంతారం గ్రామ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 58-3, 58-4లో అదే గ్రామనికి చెందిన దళితుల సీలింగ్ భూములను సుమారు 6 ఎక రాల మేరకు జరీనా స్టోన్ క్రషర్ యజమానులు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి క్రషర్ నిర్మించి పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తాండూరు రెవెన్యూ అధికారులు జరీనా స్టోన్ క్రషర్‌కు సంబంధించిన భూమిని కొలతలు చేయగా, దర్జాగా మరో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు తేలింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకి..!

ఈ వ్యవహారంపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాండూరు మండల రెవెన్యూ శాఖకు చెందిన ప్రభుత్వ సర్వేయర్ మహేశ్ సమక్షంలో జరీనా క్రషర్ స్టోన్‌కు సంబంధించిన భూమిని సర్వే చేయగా.. అసలు విషయం బయట పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతా జరుగుతున్నా జరీనా స్టోన్ క్రషర్ యాజమాన్యంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తు తం కొనసాగుతున్న వ్యాపారాల లావాదేవీలకు సంబంధించి అధికారులు కొత్త మ్యాప్ వేసి ఆస్తి పన్ను వసూలుతో పాటు అనుమతి లేకుండా నిర్మించిన వాటిపై భారీ జరిమానా విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడిన వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలి

అంతారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జరీనా క్రషర్ యాజమాన్యం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారుల కొలతలతో వెలుగులోకి వచ్చింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. క్రషర్ యాజమాన్యానికి కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలో ఉన్న భూమిని పరిరక్షించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాం డ్‌ చేస్తున్నారు.

మూడు ఎకరాలకు పైగా కబ్జా

జరీనా క్రషర్ మిషన్ (కంకర తయారీ యూనిట్స్)ను ప్రభుత్వ భూమి ఆక్రమించి దర్జాగా కొనసాగిస్తున్నారు. ఈ యూనిట్ సుమారు 3 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఈ కర్మాగారానికి ఇదివరకే 6 ఎకరాలు ఉండగా.. మరో మూడు ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి కంకర తయారీ యూనిట్ నిర్వాహకులు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు తెరతీయడం చర్చనీయాంశమవుతున్నది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సర్వేలో తేలితే చర్యలు తప్పవు..

అంతారం వాసుల ఫిర్యాదు మేరకు మా రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. సర్వే రిపోర్టర్ నాకు ఇంకా సబ్మిట్ చేయలేరు. సర్వేలో గనుక ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు వెల్లబడితే చర్యలు తప్పవని తాండూర్ తాహశీల్దార్ తారా సింగ్ అన్నారు.

Advertisement

Next Story