ఎఫ్ఎంజిఈ‌లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థిని

by Mahesh |
ఎఫ్ఎంజిఈ‌లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థిని
X

దిశ, యాచారం: మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామానికి చెందిన సలీం ఖాన్ కూతురు డాక్టర్ ఆలియా ఎఫ్.ఎమ్.జి.ఈ (ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్) ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. కృషి ఉంటే ఎంతటి కఠినమైన పనినైనా సులభంగా సాధిస్తారనడానికి ఆలియా సుల్తాన్ అలియా ఉదాహరణ. వైద్య విదేశీ విద్యార్థులుకు నిర్వహించిన ఎఫ్.ఎమ్.జి.ఈ. పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించడంతో పాటు, ఎంబిబిఎస్ పట్టా పొందింది. అలియా సాధించిన విజయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విద్యాభ్యాసం పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగిందన్నారు. ఇంటర్మీడియట్ విద్యా బైపీసీ కోర్సుతో అరుట్ల మోడల్ పాఠశాలలో చదివిందన్నారు. యునాని మెడికల్ కోర్సులో చేరి ఎంబీబీస్ చదవాలనే పట్టుదలతో చైనాలోని వైయూటీసీఎం కళాశాలలో తల్లిదండ్రులు ప్రోత్సాహంతో చదివాను అని చెప్పారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు ఆంగ్గంపై మంచి పట్టు సాధిస్తే భవిష్యత్‌‌లో ఏ కోర్సులో చేరిన సులభంగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్ లో మెడికల్ పిజీ చేయాలనుకుంటున్నానని "దిశ" కు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed