స్టూడెంట్లకు ఇబ్బందులు రావొద్దుః కలెక్టర్ శశాంక

by Nagam Mallesh |
స్టూడెంట్లకు ఇబ్బందులు రావొద్దుః కలెక్టర్ శశాంక
X

దిశ, శంషాబాద్ : విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోనే విధంగా తీర్చిదిద్దాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని రాజేంద్రనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శశాంక ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాలలోని వసతులు, ఉపాధ్యాయుల బోధన విధానము, భోజన వసతులు, పిల్లల ఎదుగుదలకు కావలసిన పోషక అహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన వసతులను పరిశీలించి మిడ్ డే మీల్ వర్కర్స్ పని విధానాన్ని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులకు కనీస అవసరాలైన మరుగు దొడ్లు, త్రాగు నీరు, సంపు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి సదుపాయాలు గూర్చి ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు.

2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం 70 శాతం నమోదు కాగా ఈ విద్యా సంవత్సరంలో 100/100 శాతం ఉత్తీర్ణత అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దాలన్నారు. మెడికల్ క్యాంప్ లు నిర్వహించి, సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం పాఠశాలను రోల్ మాడల్ గా తీర్చిదిద్దేందుకు పాఠశాలలో భోజనశాల, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ లు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన వసతుల కోసం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుటామని తెలిపారు. దీని కోసం ప్రిన్సిపల్, ఏయి ఆధ్వర్యంలో తగిన రిపోర్టు తయారు చేసి డిఇఓకు అందజేయాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. టీచర్ల హాజరు, విద్యార్థుల హాజరును పరిశీలించి ఎప్పటికప్పుడు డీఇఓకు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుసిందర్ రావ్, యం.ఇవో శంకర్, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed