- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వసూలు చేసేది నాయకులు.. బదనామ్ అధికారులకు..
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో పలు పార్టీలలో నాయకులుగా చెప్పుకునే వారు చేస్తున్న వింత వసూళ్ల పర్వం. అక్రమ నిర్మాణాల నిలుపుదల పేరుతో అధికారుల పేర్లు చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సమస్యను సృష్టిస్తూనే అదే సమస్యను తామే పరిష్కరిస్తూ డబ్బులు కూడా బేరాలు చేస్తున్నట్లు బహిరంగ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయంగా చలామణి అవుతున్న వారే వసూలు చేస్తున్నారంటే వారి విషయాలు ప్రజలకు తెలిస్తే ఏ విధంగా ఉంటుందో అన్న కనీసం ఆలోచన లేకుండా మున్సిపాలిటీలో చేపడుతున్న వింత వసూళ్ల పై దిశ ప్రత్యేక కథనం. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే సిబ్బందిని మచ్చిక చేసుకుని కొంతమంది నాయకులు పలానా చోట అక్రమ నిర్మాణం జరుగుతుందని, దాన్ని నిలిపివేయాలని సూచిస్తున్నారు.
సిబ్బంది సైతం సమాచారం ఇచ్చిన వ్యక్తులు ప్రజాప్రతినిధుల బంధువులతో పాటు స్థానిక నేతలు కావడంతో చెప్పింది తడువుగా వెళ్లి అక్రమ నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా నిలిపివేసేది అధికారులు కాకపోవడం పలానా రాజకీయ నాయకులు పలానా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు తెలపడం సదరు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు. చేపట్టేది అక్రమ నిర్మాణాలు కావడంతో అధికారులు నిజంగా చెప్పారేమోనని సదరు నాయకులను కలిసి డబ్బులు అందజేయడం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల పసుమాములలో చోటు చేసుకున్న ఓ సంఘటన. పసుమాములలో నిర్మాణం పై స్థానిక నాయకుడు మున్సిపాలిటీ సిబ్బంది పురమాయించి డబ్బులు వసూలు చేపించినట్లు విశ్వసనీయ సమాచారం.
అదే విధంగా తన పేరు ఎవరికి చెప్పొద్దంటూ సిబ్బందిని పురమాయించి గతంలో మరిన్ని ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసినట్లు సమాచారం. పైగా ఈ నిర్మాణాలను అధికారులు నిలిపివేస్తున్నట్లుగా సదరు వ్యక్తులకు తెలిసేలా చేసి అదే వ్యక్తులు సమస్య పరిష్కారం కోసం వారి వద్దకే వచ్చే విధంగా చేయడం అనంతరం బేరసారాలు చేసి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. తట్టి అన్నారంలో కూడా ఓ నాయకుడు అనుమతులు లేని నిర్మాణాల వద్దకు మున్సిపల్ సిబ్బందిని పురమాయించి అధికారులకు తెలియకుండానే డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఇటీవల అధికారులకు కూడా తెలిసినట్లు తెలిసింది. మరొక నాయకుడు అయితే ఏకంగా స్థానికంగా ఉన్న కాలనీ అసోసియేషన్ కు చందా ఇవ్వాలంటూ కూడా వేళల్లో డబ్బులు వసూలు చేసినట్లు గుసగుసలు వినిపించాయి.
కుంట్లూరులోని ఓ వార్డులో కూడా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అంటూ నిర్మాణాలకు విరుద్ధంగా చేపట్టే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ పలువురు ఇబ్బందులు పాలు చేసినట్లు తెలిసింది. ఈ విషయం ప్రజలకు తెలిసినా కూడా ప్రజల కోసమే పనిచేసినట్లుగా చెప్పుకునేందుకు గాను సమస్య సృష్టించేది వారే పరిష్కరించేది కూడా వారె కావడం ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు. ఈ క్రమంలో వేళల్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మున్సిపాలిటీలో కొంతమంది ప్రజాప్రతినిధులకు కుటుంబ సభ్యులు కొంతమంది యూట్యూబర్ల పేర్లు, పత్రికల వారి పేర్లు సైతం చెపుతూ వసూలు చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై ఉన్నతాధికారులు సైతం జోక్యం చేసుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు వాపోతున్నారు.