దారుణం: కన్నకొడుకే కాలయముడయ్యాడు

by Disha daily Web Desk |
దారుణం: కన్నకొడుకే కాలయముడయ్యాడు
X

దిశ,నందిగామ: కన్నకొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామానికి చెందిన చాకలి బాలమణి (51) దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బాలమణి భర్త చనిపోవడంతో తన ఇద్దరు కొడుకులతో కలిసి జీవిస్తుంది. పెద్దకొడుకు రమేష్ మద్యానికి బానిసగా మారి తల్లిని వేధించే వాడు. డబ్బుల కోసం తల్లిని తాడుతో ఉరివేసి దారుణహత్యకు ఒడిగట్టాడు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామయ్య తెలిపారు.

Advertisement

Next Story