- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ రెడ్డి గెలుపు ఖాయం.. మెజార్టీయే లక్ష్యం: ఎంపీ రంజిత్ రెడ్డి
దిశ, తాండూరు : దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలంతా బీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి విజయం ఖాయమైనా మెజార్టీపై దృష్టి పెట్టాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా గురువారం సుమారు 50వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 50వేల పైగా మంది పాల్గొన్నారు. పట్టణం లోని ఇందిరా చౌక్ లో ప్రారంభం
అయినా పైలెట్ నామినేషన్ ర్యాలీ అదిరింది..తాండూరు రోడ్లు జనసంద్రంగా మారినాయి. ఎమ్మెల్యే ఎంపీతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇంటి నుండి బయలుదేరే ముందు ఎమ్మెల్యే నివాసంలో పలు మతాల గురువుల ఆశీర్వదించారు. అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రమంతా బీఆర్ఎస్ హావాకొనసాగుతుందని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో మాదిరిగా కర్షకులను మళ్లీ కష్టాలపాలు చేసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారని, రైతులను మళ్లీ రాత్రిపూట లాంతర్లతో పొలాలకు పంపాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే మళ్లీ ఇవే కష్టాలు పునరావృతమవుతాయని అన్నారు.
అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలందరూ ఏకమై తాండూరు పై కుట్ర పండుతూ.. విచ్చిన్నకర శక్తులన్నీ ఒకటి అవుతున్నాయన్నారు. డబ్బు తో తాండూరు ప్రజల ఆత్మాభిమానులను కొనలేరన్నారు. ఇది నామినేషన్ ర్యాలీగా కనిపించడం లేదు విజయోత్సవ ర్యాలీగా కనిపిస్తుందన్నారు. తాండూరు లో నా గెలుపు ఖాయం , మెజార్టీయే కోసమే మన లక్ష్యం అని అన్నారు. తాండూరు బిడ్డగా లోకల్ అభ్యర్థిగా మరోసారి తాండూరు ఎమ్మెల్యే గా గెలిచేది నేనే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని సూచించారు.
ఇదే ఉత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం కోసం 25 రోజులు పని చేస్తే, మరో 5 ఏళ్ళు మీకోసం పని చేస్తాం అని వెల్లడించారు. అసలు ఏ గ్యారెంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ కే కాదు వాళ్ళ పథకాలకు కూడా గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, విట్టల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, ప్రజలు,తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.