- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి మాదిగలను మభ్యపెడుతున్నాడు : మందకృష్ణ మాదిగ
దిశ,మహేశ్వరం: సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా మాదిగలను మభ్యపెడుతున్నడాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని కళాశ్రీ గార్డెన్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాదిగల ధర్మ యుద్ధం మహాసభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తు మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడన్నాడు.ఎస్సీ వర్గీకరణలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ తో యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి మోసపు మాటలు చెప్పాడన్నారు.పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుంటే రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడన్నారు. మాదిగల పైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు పరచాలన్నారు. రేవంత్ రెడ్డి మోసం పై ధర్మ యుద్ధానికి మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ నాయకులకు పిలుపునిచ్చారు.డిసెంబర్ 21న హైదరాబాద్ లో ధర్మ యుద్ధ మహా ప్రదర్శన చేపట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మే ఎస్పీ జిల్లా అధ్యక్షుడు రావు గళ్ళ బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కళా మండలి అధ్యక్షుడు మద్దిలేటి మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు రామచంద్ర మాదిగ, శివ కుమార్ మాదిగ, ప్రణయ్ మాదిగ, మల్లిఖార్జున్ మాదిగ,ఆనంద్ మాదిగ ,ప్రశాంత్ మాదిగ, సిద్దులు మాదిగ, బొర్రా రవి మాదిగ,భాను మాదిగ, శివాజీ తదితరులు పాల్గొన్నారు.