- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా,హోంమంత్రిగా, చివరికి సీఎంగా కూడా ఫెయిల్ అయ్యాడు’
దిశ, ప్రతినిధి వికారాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర హోం మంత్రిగా, చివరికి ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయ్యాడని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిలు అన్నారు. దీని కారణంగానే లగచర్ల గ్రామ రైతులు అధికారులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై జరిగిన దాడి కేసులో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదారాబాద్ లో అరెస్టు చేసిన పోలిసులు వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో విచారించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లు నరేందర్ రెడ్డిని పరామర్శించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, హోం మంత్రిగా, చివరికి సీఎంగా కూడా ఫెయిల్ అయ్యాడని అన్నారు. ఫార్మా విలేజ్ పేరుతో రైతుల భూములు ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటాం అంటే బాధలో స్థానిక గ్రామాల రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి హైదరాబాద్ వెళ్ళగా వారికి సీఎం సమయం ఇవ్వలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక బాధలో అధికారులపై ఎదురు తిరిగి ఉండవచ్చు. రైతులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు, కానీ రైతుల బాధలు ముఖ్యమంత్రి ముందే విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నారు.
మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం..
ప్రతిరోజు కార్యకర్తలు, ప్రజలు నాయకులతో మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన ఆ కేసుకు మాకు సంబంధం ఉంది అంటూ అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యకం కాదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బోగినేని సురేష్ అనే వ్యక్తికి కూడా భూమి ఉంది. అతడు బీఆర్ఎస్ కార్యకర్త అయినంత మాత్రాన పార్టీకి ఆ దాడికి సంబంధం ఉంది అంటే ఎలా అని అన్నారు. సామాన్య రైతులకు న్యాయం చేయాల్సింది పోయి, సమస్యను తప్పుదోవ పట్టించి రాజకీయం చేయడం సబబు కాదని అన్నారు. వీరితోపాటు వికారాబాద్, పరిగి నియోజవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
సాయంత్రం లోపు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రిమాండ్..?
లగ చర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ ఫోన్లో మాట్లాడి దాడికి ప్రోత్సహించి నట్టు బలమైన ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కారణంగా నరేందర్ రెడ్డిని ఈరోజు సాయంత్రం లోపు రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పరిగి జడ్జి అందుబాటులో లేకపోవడం కారణంగా వికారాబాద్ కోర్టులో రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డిలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడించారని, అధైర్య పడొద్దు మేము, పార్టీ మీ వెంట ఉన్నామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.