- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సాగర్ రోడ్డుపై ఆక్రమణలు తొలగింపు
దిశ, తుర్కయంజాల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జునసాగర్ రహదారిని ఆనుకొని అక్రమంగా వెలసిన నిర్మాణాలను, వ్యాపార సముదాయాలను అధికారులు తొలగించారు. శుక్రవారం భారీ పోలీస్ బందోబస్త్ మధ్య కమిషనర్ ఎంఎన్ ఆర్ జ్యోతి, టీపీవో దేవానంద్ పర్యవేక్షణలో అక్రమణలను జేసీబీలతో కూల్చివేయించారు. ఈ సందర్బంగా కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ సాగర్ రహదారికి ఆనుకొని ఉన్న గృహాల యజమానులు కొందరు షెడ్లు వేసి రోడ్డును ఆక్రమించారని, దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురికావడమే కాకుండా తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నట్లు గుర్తించమన్నారు. అలాంటి నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. వ్యాపారస్తులకు, గృహ యజమానులకు ముందస్తు నోటీసు ఇచ్చి, మార్కింగ్ చేసిన అనంతరం కూల్చివేతలు చేపట్టామన్నారు. కౌన్సిల్ సమావేశంలోనూ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెప్పారు. ఇకపై ఎవరైనా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Tags
- rangareddy