- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కలెక్టర్ పై దాడిని ఖండిస్తూ జిల్లా అధికారుల నిరసన..
దిశ ప్రతినిధి వికారాబాద్ : జిల్లా మెజిస్ట్రేట్ గా అత్యున్నత పోస్టుల్లో ఉన్న జిల్లా కలెక్టర్ పైన దాడి చేస్తే కింది స్థాయి ఉద్యోగులమైన మా పరిస్థితి ఏమిటని..? కొడంగల్ దుద్యాల మండలం లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ.. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ట్రెస్సా ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఫార్మా విలేజ్ కోసం భూ సేకరణలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో రైతులతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, కాడ ప్రత్యేక అధికారి, స్థానిక మండల ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లగా.. కలెక్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ గ్రామ ప్రజలు చట్ట విరుద్ధంగా అధికారులపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా కలెక్టర్, అధికారుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో కలెక్టర్ తో అధికారులు, చివరికి పోలీసులు సైతం అక్కడ నుంచి కారులో తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే కలెక్టర్ పై గ్రామస్తులు దాడి చేసే సమయంలో కలెక్టర్ కు సెక్యూరిటీగా పోలీసులు కూడా లేకపోవడంతో ఎస్పీ నారాయణ రెడ్డి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలో కలెక్టర్ కె భద్రత లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పెన్ డౌన్ కు పిలుపునిచ్చిన జిల్లా ట్రెస్సా..
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం సాయంత్రం ట్రెస్సా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, వారికి జీవిత ఖైదు విధించే వరకు విధులు బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యాలయాల దగ్గరకు వెళ్లిన, కార్యాలయం తాళాలు తీయకుండా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి, స్పీకర్ సొంత జిల్లాలోని పరిస్థితి ఇలా ఉంటే మేము ఉద్యోగాలు ఎలా చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన ఆపేదే లేదని, ఉద్యోగాలు పోయిన వెనకడుగు వేయమని స్పష్టం చేశారు.
రైతులు మాపై దాడి చేయలేదు : మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్..
దుద్యాల మండలంలో జరిగిన దాడి పట్ల జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాపై రైతులు ఎలాంటి దాడి చేయలేదని, అక్కడకి ఇతర వ్యక్తులు వచ్చి ఏదో కొంత తెలియని పరిస్థితి క్రియేట్ చేశారు. అనుకోకుండా జరిగిన సంఘటన అది. దయచేసి దాన్ని దాడి అని సంబోధించవద్దు. రైతులు మాతో మాట్లాడడానికి అక్కడికి రమ్మని పిలిచారు అంటూ కలెక్టర్ వివరాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే కలెక్టర్ మాట్లాడిన విధానం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు ఉండవచ్చని చర్చ నడుస్తుంది. సీఎం సొంత జిల్లా కావడంతో సమస్య పెద్దది కాకుండా సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రతిపక్ష నేతలు చర్చించుకుంటున్నారు.