జిల్లాలో యథేచ్చగా అధికారులు అనుమతులు

by Kalyani |
జిల్లాలో యథేచ్చగా అధికారులు అనుమతులు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: సాగునీటి ప్రాజెక్టులు లేని ప్రాంతాలకు చెరువులు, కుంటలు రైతులకు జీవనాధారం. అలాంటి చెరువులను, కుంటలను కాపాడాల్సిన అధికారులు రియల్​ వ్యాపారుల చేతిలో బంధీ అవుతున్నారు. చెరువుల ఎఫ్​టీఎల్​, కుంటల ప్రవాహా హద్దులుతో సంబంధం లేకుండా రియల్​ వ్యాపారులకు ఇరిగేషన్​ అధికారులు ఎన్​వోసీలు ఇచ్చారు. చేతివాటలకు ఆలవాటు పడిన అధికారులు చేసిన తప్పిదాలతో సామాన్య ప్రజలు అవస్థలు ఎదుర్కొనే పరిస్థితి దాపురించింది.

చెరువులు, కుంటలను నాశనం చేయడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఏర్పడే విపత్తులతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్​ అధికారులు బాధ్యతయుత విధుల్లో ఉండి కాసులకు కక్కుర్తి పడి సామాన్యుల ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదే తంతు ఈ ప్రభుత్వంలో పునరావృత్తం అయితే ఇక అంతే సంగతులనే ప్రచారం ఉంది. స్ధానికుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని హైడ్రా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

చరిత్ర నాలాను విధ్వంసం...

ఫిరంగి నాలా రంగారెడ్డి జిల్లా రైతులకు గుండెకాయలాంటిది. ఈ నాలా రంగారెడ్డిలోని అత్యధిక చెరువులను నీటితో నింపి సాగు, తాగునీటిని సరఫరా చేస్తారు. నాలా ప్రవహించే మార్గానికి ఇరువైపుల నిబంధనలను అతిక్రమించి రియల్​ వ్యాపారులు అక్రమ పద్దతిలో అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో 32 ఫీట్ల వెడల్పుతో ప్రవహించే నాలా పూర్తిగా 10 ఫీట్ల వెడల్పు వరకే పరిమితం చేశారు. ఈ నాలా పూర్తిగా విధ్వంసం చేస్తే భారీ వర్షాలు వచ్చినప్పుడు నగరంలో కనిపించే దుస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించక తప్పదు. భూ విలువ పెరిగిపోవడంతో పట్టదారులైన యాజమాన్యులు వ్యవసాయం చేయలేక విక్రయాలకు పాల్పడుతున్నారు.

దీంతో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు వివాధమైన, కుంటలు, చెరువుల పక్కనుండే భూములను తీసుకోని రియల్​ వ్యాపారులు అభివృద్ధి చేసి విక్రయాలు చేస్తున్నారు. రియల్​ వ్యాపారులు చేసే అక్రమాలకు కొంత మంది అధికారులు అండదండలు ఉండటంతో తప్పుడు పద్దతిలో పయనిస్తున్నారు. అధికారులు, వ్యాపారులు చేసే నిర్వాహకంతో అమాయక ప్రజలు మోసపోతున్నారు. అంతేకాకుండా ఎన్నో చెరువులను నింపి, రైతులకు, ప్రజలకు సాగు తాగునీటిని సరఫరా చేసే నాలాను ధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది.

ఫిరంగి కాల్వకు చెక్​...

షాబాద్​లో ప్రారంభమైన ఫిరంగ్​ కాల్వ శంషాబాద్, గండిపేట్​, రాజేంద్రనగర్​, సరూర్​నగర్​, ఇబ్రహీంపట్నం పరిసరా ప్రాంతాల్లోని చెరువులను నింపనుంది. అలాంటి కాల్వాను పూర్తిగా విధ్వంసం చేసే కుట్ర జరుగుతుందని సమాచారం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం సౌతంరాయి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 5, 6లల్లో 32 ఫీట్ల వెడల్పుతో ఇబ్రహీంపట్నం మండలం పెద్ద చెరువలోకి ప్రవహిస్తుంది. ఈ నాలా పక్కనే అపర్ణ, సుమధుర కన్​స్ట్రక్ఛర్​ కంపెనీలు వాల్టా చట్టానికి, ఇరిగేషన్​ నిబంధనలకు విరుద్దంగా పెద్ద పెద్ద విల్లాలు నిర్మాణం చేస్తున్నారు. అంతేకాకుండా ఫిరంగి కాల్వను వ్యాపారులు అనుకూలంగా మల్చుకోని డ్రైనేజీని వదిలివేయడం ఆలవాటైయింది. దీంతో ఎంతో కొంత ప్రవాహించే నీరు కూడా కలుషితమైంది.

శాఖల మధ్య సమన్వయం లోపం...

ఇరిగేషన్​, హెచ్​ఎండీఏ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయి. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థ అధికారులు ఎన్​వోసీలు ఇవ్వడం... ఆ ధృవీకరణ పత్రంతో ప్రభుత్వ అనుమతులు తీసుకుని భారీ స్ధాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ శాఖల మధ్య సమన్వయం లేనంత వరకు ఈ తంతు ఎప్పటికీ ఆగదని మేధావులు చెబుతున్న విషయం. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తతో పనిచేస్తారా లేదా వేచిచూడాల్సిందే.

హైడ్రా పట్టించుకోవాలని వినతి...

అన్యాక్రాంతమవుతున్న ఫిరంగి నాలాను పూర్తిస్ధాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని స్ధానికులు, మేధావులు హైడ్రాను కోరుతున్నారు. చెరువులు, నాలాలను ధ్వంసం చేయడం ఎఫ్టీఎల్​, బఫర్​ జోన్​ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా రియల్​ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. స్ధానికులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ఇచ్చే వినతి పత్రాలను స్వీకరించి విచారణ చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed