- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీటీ రోడ్డును వేయండి సార్..
దిశ, తలకొండపల్లి : మండలంలోని వీరన్న పల్లి గ్రామం నుండి గట్టు ఇప్పలపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు పాదయాత్ర చేశారు. బుధవారం కొంతమంది గ్రామస్తులు వీరన్న పల్లి గ్రామం నుండి మండల కేంద్రానికి పాదయాత్రగా చేరుకొని ఎంపీడీవో రాఘవులుకు వినతి పత్రం అందజేశారు. ఈ పాదయాత్రకు సీపీఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అనంతరం సీపీఎం నేతలు దుబ్బ చెన్నయ్య, కార్యదర్శి గుమ్మడి కురుమయ్య మాట్లాడుతూ గట్టు ఇప్పలపల్లి గ్రామం నుండి విడిపోయి నూతనంగా వీరన్నపల్లి గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసి, అభివృద్ధిని మాత్రం మర్చిపోయారని అన్నారు. గ్రామానికి వెళ్లవలసిన మట్టి రోడ్డు వర్షం వస్తే బురద మయంగా మారుతుందని, ప్రతినిత్యం రేషన్ సరుకులు, కూరగాయల కోసం గ్రామం నుండి గట్టు ఇప్పలపల్లికి రావాల్సిన పరిస్థితి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు.