నిర్వీర్యం అవుతున్న ఓపెన్ జిమ్‌లు..చోద్యం చూస్తున్న అధికారులు

by Aamani |
నిర్వీర్యం అవుతున్న ఓపెన్ జిమ్‌లు..చోద్యం చూస్తున్న అధికారులు
X

దిశ‌,గండిపేట్ : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ఓపెన్ జిమ్ కార్యక్రమం నిర్వీర్యం అవుతుంది. అడిగేవారు లేకపోవడంతో జిమ్ ల‌లో ఉన్న సామాగ్రి పాడవుతుంది. అయినా ఎవరికీ పట్టడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఓపెన్ జింలు మనుగ‌డ‌కు నోచుకోవడం లేదు. దీంతో స్థానికంగా ఓపెన్ జిమ్ లు ఎందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో ఓపెన్ జిమ్ ల‌ కోసం వచ్చే ప్రజలు రావడమే మానేశారు. లక్షల రూపాయలను వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ల‌ పరికరాలను పాడు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని స్థానికులు మండిపడుతున్నారు. గండిపేట మండల పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని నార్సింగి హైట్స్ లో ఓపెన్ జిమ్ ల నిర్వాహ‌ణ‌ లేక పరికరాలు పాడవుతున్నాయి. దీనికి తోడు స్థానికంగా ఆకతాయిలు ఈ జిమ్ పరికరాలను ఎత్తుకెళ్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయంలో గతంలో అధికారులకు వివరించిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపిన నిర్వహణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

బట్టల ఆరేసుకుంటున్న‌ వైనం...

నార్సింగి మున్సిపల్ పరిధిలోని నార్సింగి హైట్స్ ప్రధాన రహదారిలో గతంలో ఓపెన్ జిమ్ సామాను మాయమైనట్లు దిశ పత్రికలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ విషయంపై గతంలో ఉన్న కమిషనర్ ను ప్రశ్నిస్తే చిరాకు పడినట్లు అందరికీ తెలిసిన విషయమే. నాటి నుంచి నేటి వరకు ఆ ఓపెన్ జిమ్ లో పరికరాలు ఏర్పాటు చేయక పోగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు కాపాడలేక పోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అప్పట్లో ఉన్న కొద్ది జిమ్ సామాన్లు కూడా కనిపించకపోవడం గమనర్హం. ఎవరు జిమ్ కి రాకపోవడంతో స్థానికంగా మహిళలు బట్టలను ఆరేసుకుంటున్నారని ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఓపెన్ జిమ్ నిర్వహణ చేపట్టి తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed