అధికారుల అత్యుత్సాహం.. ఇళ్ల యజమానులకు ఇక్కట్లు...

by Sumithra |
అధికారుల అత్యుత్సాహం.. ఇళ్ల యజమానులకు ఇక్కట్లు...
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని అధికారులు అనుమతులు లేని నిర్మాణాల విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటి నిర్మాణాల విషయంలో ముఖ్యంగా అధికారులు చూపిస్తున్న శ్రద్ధ ప్రభుత్వానికి కావలసిన ఆదాయానికా లేక తమ సొంత ఆదాయం పెంచుకునెందుకా అర్థం కాని పరిస్థితి. అనుమతులు తీసుకుని ఎటువంటి నిర్మాణం లేకపోయినప్పటికీ అదనపు నిర్మాణం చేశారని నోటీసులు పంపిస్తూ మానసిక ఇబ్బందులు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇటీవల సదాశివ వెంచర్ లో కొంతమంది ప్రముఖుల పేరుతో ఉన్న ఇళ్ల నిర్మాణాలు డివీయేషన్లు ఉన్నాయంటూ నోటీసులు పంపించారు. అన్ని సక్రమంగా ఉన్నా నోటీసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పిల్లర్లు కూడా పూర్తి కాక ముందే అదనపు గదుల నిర్మిస్తున్నారంటూ ఆరోపిస్తూ నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరిస్తున్నారు.

అదేవిధంగా నిర్మాణాలను వ్యాపారాలు చేసుకునే వారిని వదిలి ఇల్లు నిర్మాణాలు చేసుకుంటున్న వారిపై తమ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు ఏకపక్షంగా కాకుండా పూర్తి వివరాలు తెలుసుకొని నోటీసులు అందించి అవసరమైతే తగిన సలహాలు సూచనలు చేస్తూ అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు వేధిస్తున్న తీరు మరోలా ఉందని పలు ఇళ్ల నిర్మాణా దారులు ఆందోళన చెండుతున్నారు. పర్మిషన్ ఉన్నా లేకున్నా మాకెందుకు అంటూ లక్షలు కావాలంటూ నిత్యం మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిపై ఉన్నతధికారులు ద్రుష్టి సారించి ప్రజలకు సహకరించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed