ఏడేండ్ల వయస్సులోనే బంగారు పతకం సాధించాడు..

by Sumithra |
ఏడేండ్ల వయస్సులోనే బంగారు పతకం సాధించాడు..
X

దిశ, శంషాబాద్ : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన అండర్ 7 నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించిన నిధీష్ శ్యామల్ ను బుధవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మహిళా దేవుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయస్థాయిలో అండర్ 7 చెస్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించడం తెలంగాణకే గర్వకారణమన్నారు.

ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణకు అండర్ 7 చెస్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం రావడం ఇదే మొదటిసారన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి రావలసిన ప్రోత్సాహకాలను అందే విధంగా చూస్తామన్నారు. అనంతరం అండర్ 7 నేషనల్ ఛాంపియన్ నిధీష్ శ్యామల్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

గతంలో జాతీయ స్థాయిలో చెస్ ఛాంపియన్షిప్ లో రెండో బహుమతి పొందానని చెప్పాడు. రాబోయే రోజుల్లో చెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో ప్రపంచ స్థాయిలో ఆడి బంగారు పతకం సాధించడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ రామ్ రాజ్, డాక్టర్ స్మితా రామ్ రాజ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దండు ఇస్తారి, నాయకులు నీరటీ రాజు, మోహన్ రావు, కృష్ణ గౌడ్, యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed