తాండూరు రూరల్ సీఐ గా నగేష్ బాధ్యతలు స్వీకరణ

by Kalyani |
తాండూరు రూరల్ సీఐ గా నగేష్ బాధ్యతలు స్వీకరణ
X

దిశ, తాండూరు రూరల్ : తాండూరు రూరల్ సీఐగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి పరిగి సీఐగా బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో మంగళవారం నూతన సీఐగా నగేష్ బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లోసర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన నగేష్ ను తాండూర్ రూరల్ సీఐగా ప్రభుత్వం బదిలీ చేసింది. రూరల్ సీఐ నగేష్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల తో పాటు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాలు చేపట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే శాంతిభద్రతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడ పోలీసుల సహకారం ఉంటుందన్నారు. పోలీస్​ స్టేషన్​ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు నేర సంబంధిత సేవలను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. అంతకుముందు సీఐ ఎస్సై విట్టల్ రెడ్డి బొకేతో స్వాగతం పలికారు. ఎస్సై విట్టల్ రెడ్డి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed