శ్రీ చైతన్య కాలేజీ ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన...

by Sumithra |   ( Updated:2023-03-02 13:23:19.0  )
శ్రీ చైతన్య కాలేజీ ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన...
X

దిశ, గండిపేట్ : జూనియర్ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య పట్ల కాలేజీ యాజమాన్యం పై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీసుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను అరెస్ట్ చేసే వరకు కాలేజీ ముందు నుండి కదిలేది లేదంటూ కోమటిరెడ్డి స్థానిక సీఐతో వాగ్వివాదానికి దిగారు. డీసీపీకి ఫోన్ చేసి నిందితులని అర్ధగంటలో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

లేదంటే నిరాహారదీక్ష చేస్తామంటూ మొండిపట్టుపట్లారు. అనంతరం విద్యార్థిని కొట్టిన వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారని, అందుకే దీక్ష విరమణ చేసుకుని వెళ్లిపోతున్నని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ విద్యార్థికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో తల్లిదండ్రులు విద్యార్థులు చదివించకూడదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం ఇంటర్ బోర్డు అధికారులు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story