- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించిన ఎంపీ డీకే అరుణ..
దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగ చర్ల గ్రామంలో జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ పై అలాగే రెవెన్యూ అధికారుల పై జరిగిన దాడి పట్ల మొత్తం బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలని ఎంపీ డీకే.అరుణ ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించిన ఎంపీ, లగచర్లలో జరిగిన దాడి ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలు తీసుకురావడంలో తప్పులేదు కానీ రైతులకు ఇష్టం లేనప్పుడు అక్కడ భూసేకరణ ఆపివేయాలన్నారు. ఈ దాడి ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం బాధ్యత వహించాలని అన్నారు. అలాగే జిల్లాలో లాండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాంటప్పుడు మేము మా సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే తప్పు ఏంటని అన్నారు.
కొడంగల్ లో ఈ రోజు అనేక పెళ్లిళ్లకు వెళ్లాల్సి ఉండగా మన్నెగూడ దగ్గర పోలీసులు 40 నిమిషాలు ఆపారు. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి కలెక్టర్ ను పరామర్శిస్తే ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య రాదు. కానీ ఒక ఎంపీని అయిన నేను కలెక్టర్ ను పరామర్శించడానికి వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అమాయకులైన రైతుల పై కేసులు పెట్టకుండా చూడాలన్నారు. పొల్యూషన్ కలిగించే ఫార్మా కంపెనీ కాకుండా ఇతర కంపెనీలు తీసుకువచ్చి జిల్లాను కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే దానికి మేము స్వాగతిస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు నడుచుకోవాలన్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపి రైతులకు తగిన న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.