రోడ్డు ఎలా.. ప్రయాణం సాగేది ఎలా ?

by Sumithra |
రోడ్డు ఎలా.. ప్రయాణం సాగేది ఎలా ?
X

దిశ, కొత్తూరు : గ్రామాలను కలుపుతూ అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయకపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే రోడ్లు చిత్తడిగా మారుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో మరిన్ని కష్టాలు పడుతున్నారు. వివరాలలోకి వెళితే కొత్తూరు నుండి కుమ్మరిగూడకు వెళ్లే మట్టిరోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. ఆ రోడ్డు గుండా వెళ్ళాలంటేనే వాహనదారులు నరకంచూస్తున్నారు. మంగళవారం కురిసిన వర్షానికి రోడ్డు చిత్తడిగా మారింది.

ఆ రోడ్డు గుండా వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటుగా వెళుతున్న ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ బురదలో అదుపుతప్పి క్రిందపడటం గమనార్హం. ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణమని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని రోడ్డు బాగుచేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story