- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీర్ పేట్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డికి అవిశ్వాస గండం..
దిశ,మీర్ పేట్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, మీర్ పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కార్పొరేటర్లు నిశ్చయించుకున్నారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ శశాంక కు అవిశ్వాస పత్రాలను బీజేపీ కార్పొరేటర్లు అందచేశారు.మీర్ పేట్ కార్పొరేషన్ లో మొత్తం 46 మంది కార్పొరేటర్ల కు గానూ 32 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస పత్రాల ను బీజేపీ కార్పొరేటర్లు నీలా రవి నాయక్,మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి ,వేముల నరసింహ, ఇంద్రావత్ రవి నాయక్,పలువురు కార్పొరేటర్లు కలెక్టర్ కు అవిశ్వాస పత్రాలను సమర్పించారు.
గత మార్చి నెల లో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్ పై బీజేపీ ,బీఆర్ఎస్ అసంతృప్తి కార్పొరేటర్లు, ఆ నాడు కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ల తో కలిసి అవిశ్వాసం పెట్టారు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి మేయర్ పై వ్యతిరేకంగా ఉన్న బిఆర్ఎస్ అసంతృప్తి కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అవ్వడం తో అవిశ్వాసం గెలవాలంటే 31 మంది కార్పొరేటర్స్ అవసరం కానీ 29 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి హాజరయ్యారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు గా హాజరు కాకపోవడంతో అవిశ్వాసం దిగిపోయిందని ఆర్డీఓ ప్రకటించిన విషయం తెలిసిందే.డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం నెగ్గకుండా స్థానిక ఎమ్మెల్యే తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తారా లేదా అనేది వేచి చూద్దాం.