- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిరేకల్ బీఆర్ఎస్‌లో విభేదాలు...క్యాడర్‌లో అయోమయం
దిశ,నకిరేకల్ : ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ప్రజల పక్షాన పోరాడుదాం.. ప్రజలకు అండగా నిలిచి అధికారంలోకి వద్దాం... అంటూ ఒకవైపు అగ్ర నాయకులు మాట్లాడుతుంటే మరోవైపు నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు నెలకొన్నాయి. దీంతో పార్టీ క్యాడర్ అయోమయం అవుతుంది. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాయకత్వంలో పని చేయలేక ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా కేటీఆర్ మహబూబాబాద్ పర్యటన సందర్భంగా విషయం బహిర్గతమైంది.
కేటీఆర్ పర్యటన సమయంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాల పట్టణంలో స్వాగతం పలకగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నార్కట్ పల్లి ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా నార్కట్ పల్లిలో స్వాగతం పలికారు. అదేవిధంగా తమ అనుకూల వర్గం తో కలిసి ఆయన తీరును వ్యతిరేకిస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనంతటికీ కారణం పార్టీకి పనిచేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా అవమానించడమేనని తమ వర్గం వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని సూచించడం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరు ప్రస్తావించకపోవడం తో ఈ విషయం తేటతెల్లమవుతుంది. నార్కట్ పల్లి మండలం కార్యకర్తలు మాత్రమే కాదని నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు అంతా అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ చేశారని గుసగుసలు...
ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారుల అరెస్టుల అనంతరం మొదటిసారిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నోటీసులపై విచారణకు సైతం వెళ్లారు. ఈ విచారణలు కొన్ని విషయాలు తెలిశాయని అందులో సొంత పార్టీ కార్యకర్తల ఫోన్ ట్యాప్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమపై నమ్మకం లేకనే ఈ విధంగా చేశారని ఇంకా ఎందుకు ఆయన నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతోనే విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు కొంతమందికి పెద్ద పీట వేస్తూ మరికొంతమందిని పట్టించుకోకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదని వారి సొంత స్వలాభాల కోసం మాత్రమే తమ నేతను బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు మాట్లాడుతున్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనే విషయం తెలియాలంటే అధికారులు విచారణలో జరిగిన విషయాన్ని వెల్లడించాల్సిందే.
డీలిమిటేషన్ దీనంతటికీ కారణమవుతుందా..?
నియోజకవర్గాల డీలిమిటేషన్ అవుతుందని వార్తలు నేపథ్యంలోనే ఇలాంటి విభేదాలు చోటు చేసుకుంటున్నాయా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాగా డీలిమిటేషన్ జరిగితే జనరల్ రిజర్వ్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ జనరల్ అయితే పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. తమ ప్రాబల్యాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా చాటుకునేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారా అంటే మరింత సమయం వేచి చూడాల్సిందే.
విభేదాలు సద్దుమణిగేనా...!
నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో వ్యతిరేకిస్తున్న నాయకులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని వెల్లడిస్తున్నారు. అదే సమయంలో లింగయ్య సైతం జగదీశ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు ప్రస్తుతం. నియోజకవర్గంలో ప్రస్తుతం విభేదాలు కొనసాగుతున్న విషయం ఆయనకు తెలిసి ఎటువంటి విభేదాలు లేకుండా సద్దుమణిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. విభేదాలను తొలగిస్తేనే రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఓడించి తమ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలరు. కానీ ఇలా విభేదాలతో కొనసాగితే నష్టపోవాల్సిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పార్టీ పెద్దలు ఈ విభేదాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు తెలియాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే.
ఆయన నాయకత్వంలో పనిచేయలేకపోతున్నాం...: సూది రెడ్డి నరేందర్ రెడ్డి, నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి నాయకత్వంలో పనిచేయలేకపోతున్నాం అందుకే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బండ నరేందర్ రెడ్డి ల నాయకత్వంలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మొదటి నుంచి పార్టీకి కష్టపడుతున్నప్పటికీ మాపై నమ్మకం ఉంచటం లేదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా అవమానాలకు గురి చేస్తున్నారు. అందుకే ఆయన నాయకత్వాన్ని కాకుండా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.