- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త మెనూ తో భోజనాన్ని ప్రారంభించాలి : మంత్రి పొంగులేటి
దిశ ప్రతినిధి, వికారాబాద్ : ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డిలతో కలిసి ప్రజా పాలనలో వచ్చిన ఇండ్ల దరఖాస్తుల యాప్ అప్లోడ్ ప్రక్రియ, వసతి గృహాల్లోని వసతులు, గ్రూప్-2 పరీక్షల నిర్వహణ, వసతి గృహాల్లో డైట్ చార్జీల పెంపు అమలు పై జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజపాలనలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారికి అదేవిధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన తెలిపారు. అధికారులు ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన వారి వివరాలను అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచినందున డిసెంబర్ 14న అన్ని కేంద్రాల్లో కొత్త మెనూ తో భోజనాన్ని ప్రారంభించాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పరిగి తహసిల్దార్ కార్యాలయం నుండి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కలెక్టరేట్ నుండి జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.