- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నకిలీ ఐస్ క్రీమ్ తయారీ.. ఇద్దరిపై కేసు
దిశ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ కేంద్రంలో నకిలీ ఐస్ క్రీమ్ ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, పోలీసులు గుర్తించారు. పట్టణ కేంద్రంలో నకిలీ ఐస్ క్రీములు తయారు చేస్తున్న మేఘ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీపై మంగళవారం ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భారీగా నకిలీ ఐస్ క్రీమ్ వాహనాలను సీజ్ చేశారు. దర్జాగా నకిలీ ఐస్ క్రీములు తయారు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు గుర్తించి వారి వద్ద నుండి రూ.10 లక్షల విలువ చేసే వివిధ రకాల ఐస్ క్రీములు పలు వాహనాలను సీజ్ చేశారు.
ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న కంపెనీ 2010వ సంవత్సరం నుండి మళ్ళీ రెన్యువల్ చేసుకోకుండా, కనీస నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని పోలీసులు తెలిపారు. అపరిశుభ్రమైన బోరు నీళ్లతో నకిలీ ఐస్ క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆకర్షనీయమైన స్టిక్కరింగ్ చేసి మారుమూల గ్రామీణ ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటనలో ఆమనగల్లు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఎర్రబిక్య తండాకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుందరయ్య పేర్కొన్నారు.