- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మక్క రైతుల మనో వేదన.. కొనుగోలు కేంద్రం లేక అవస్థలు
దిశ,మర్పల్లి: రైతులు కష్టపడి పండించిన పంటలను విక్రయాలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ప్రతి ఏడాది మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం తో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తులకు ఆశ్రయిస్తున్నారు.
ఇదే అదనుగా వ్యాపారులు రైతుల నడ్డి విరుస్తూ తెలుగు పేరిట కమిషన్ పేరిట రైతులను నట్టేట ముంచుతున్నారు.మర్పల్లి మార్కెట్ మూడు మండలాలకు కలిపి ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను విక్రయించేందుకు తరలి వచ్చే వారు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.