- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేశ్వరం ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్
దిశ, బడంగ్పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన సీఎం ప్రజాఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కె పురం, సరూర్నగర్ డివిజన్లు, మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లు, జల్పల్లి మున్సిపాలిటీ, తుక్కుగూడ, కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల నుంచి వేలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు కదిలివచ్చారు. దీంతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాఆశీర్వాద సభకు పెద్దఎత్తున తరలివచ్చారు.
అప్పటికే కుర్చీలలో బీఆర్ఎస్ శ్రేణులు నిండిపోవడంతో మంత్రి సబితమ్మ, సీఎం కేసీఆర్ ప్రసంగాలను సైతం వర్షంలోనే నిలబడి వినడం కనిపించింది. అంతేగాకుండా మల్లాపూర్ ఆర్సిఐ రోడ్డు సుల్తాన్ పూర్ నుంచి పహాడిషరీఫ్ కు వెళ్లే రహదారి బీఆర్ఎస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమయ్యింది. కళాకారుల బృందం ఆటపాటలతో గులాభి శ్రేణలతో ఉత్సాహం రెట్టింపయ్యింది. మహేశ్వరం డివిజన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఆశీర్వాద సభకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.