- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధ్యాత్మిక క్షేత్రంగా మహేశ్వరం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, మహేశ్వరం: ఆధ్యాత్మిక క్షేత్రంగా మహేశ్వరం నియోజకవర్గం మారిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం మండలం కేసీ తండాలో ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా స్వంత నిధులతో ఏర్పాటు చేసిన భారీ పరమశివుని విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కేసీ తండాలో మహేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నారు.
మహేశ్వరం మండల కేంద్రంలోని గడికోట, శ్రీ శివగంగ ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గంలో 8 కోట్ల నిధులతో ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్ రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత ఆంద్యానాయక్, కేసితండా సర్పంచ్ మోతిలాల్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.