- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్…
దిశ, గండిపేట్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఓవర్ లోడ్ తో వెళ్తున్న రోబో సాండ్ లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో బోల్తా కొట్టింది. ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదం. ఓవర్ లోడుతో మితిమీరిన వేగంతో వెళ్తుండగా టైర్ బ్లాస్ట్ అవ్వటంతో లారీ పల్టీ కొట్టినట్లు తెలుస్తోంది. అప్ప జంక్షన్ నుండి కోకాపేట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పల్టీ కొట్టిన లారీ రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిబ్బంది భారీ క్రేన్ ల సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మితిమీరిన వేగం, ఓవర్ లోడే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.