దుష్ట బీజేపీ పాలనను గద్దె దించి.. కాంగ్రెస్‌ను గెలిపిద్దాం : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

by Nagaya |   ( Updated:2024-04-29 07:41:45.0  )
దుష్ట బీజేపీ పాలనను గద్దె దించి.. కాంగ్రెస్‌ను గెలిపిద్దాం : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
X

దిశ, మొయినాబాద్: గత పదేళ్లుగా ప్రజలను దోచుకున్న దుష్ట బీజేపీ పాలనను గద్దెదించి ప్రజా శ్రేయస్సును కోరే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ హిమాయత్ నగర్ గ్రామాల్లో సోమవారం చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాదిరిగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

చేవెళ్ల పార్లమెంట్ నుండి ఎంపీ గా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పమేనా భీమ్ భరత్ మాట్లాడుతూ గత 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని పథకాలను నాశనం చేసి దేశాన్ని దివాలా తీసిన బీజేపీ దుష్టపాలనను అంతమందించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ మసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాబాద్ దర్శన్, మండల అధ్యక్షుడు తమ్మలి మన్నెయ్య, చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటారెడ్డి, కొమ్మిడి వెంకట్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు స్థానిక నాయకులు సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed